- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గేమింగ్ బిజినెస్‌లోకి కొత్త పెళ్లి కూతురు
దిశ, వెబ్‌డెస్క్: కొత్త పెళ్లి కూతురు కాజల్ అగర్వాల్ తన ఆలోచనలను బిజినెస్ వైపు మళ్లించింది. ఓకీ వెంచర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న భామ.. స్టార్టప్ కంపెనీ ఓకీ గేమింగ్‌లో 15 శాతం షేర్లు కొనుగోలు చేసింది. తద్వారా ఓకీ వెంచర్స్ అనుబంధ సంస్థ ఓకీ గేమింగ్‌లో పార్టనర్‌గా చేరింది. ఈ సందర్భంగా మాట్లాడిన కాజల్.. ఓకీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌పై పూర్తి నమ్మకముందని.. భారతీయ సంస్కృతి, పురాణాలు, జానపదాలకు గేమ్స్ కేంద్రంగా మారడం ఆనందంగా ఉందని చెప్పింది. ఇది వినియోగదారులకు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని తెలిపింది. స్ట్రాటెజిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన భామ.. కంపెనీ ప్రమోషన్స్, మార్కెటింగ్‌లో సహాయపడతానని, యూజర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని వెల్లడించడం విశేషం. కంపెనీలో భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్న కాజల్.. గేమింగ్ ఇండస్ట్రీకి మరింత మంది మహిళలను తీసుకొచ్చేందుకు ట్రై చేస్తానంది. వినియోగదారులుగా, డెవలపర్స్‌గా మాత్రమే కాదు.. గేమ్‌లో కథానాయకుల్లా కూడా మార్చేందుకు ప్రయత్నిస్తానంది.
కాగా ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమూన్ ట్రిప్‌లో ఉన్న అందాల చందమామ.. భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. మోస్ట్ రొమాంటిక్ పిక్స్ షేర్ చేస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.