డార్లింగ్ జోడి రిపీట్.. ఫుల్ ఎగ్జైట్‌‌మెంట్‌లో ఫ్యాన్స్

by Jakkula Samataha |   ( Updated:2021-07-05 05:49:19.0  )
prabas-kajal
X

దిశ, సినిమా : డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్ సినిమాలతో ప్రభాస్, కాజల్ అగర్వాల్ జోడీ సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతోందని టాక్. ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘సలార్’ చేస్తుండగా.. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. మాస్ ఆడియన్స్ కోసం ఐటెమ్ సాంగ్ ప్లాన్ చేశారట మేకర్స్.

ఇందుకోసం మిస్టర్ పర్‌ఫెక్ట్ జోడీ కాజల్‌ను ఎంచుకున్నారని సమాచారం. ఇప్పటికే తనను అప్రోచ్ కాగా స్పెషల్ సాంగ్‌కు ఓకే చెప్పిందనే వార్తలు హల్ చల్ చేస్తుండగా.. మరోసారి తెరపై ఈ బెస్ట్ జోడీని చూసేందుకు ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాతో బిజీగా ఉన్న కాజల్.. లేటెస్ట్‌గా హిందీ ప్రాజెక్ట్ ‘ఉమ’కు సైన్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed