కాజల్ నిశ్చితార్థమా?.. అలాంటిదేమీ లేదు!

by  |
కాజల్ నిశ్చితార్థమా?.. అలాంటిదేమీ లేదు!
X

దిశ, వెబ్‌డెస్క్: అందాల భామ కాజల్ అగర్వాల్ కెరియర్.. మొదటి నుంచి కూడా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్లుగానే సాగుతోంది. ఇండస్ట్రీకొచ్చి 15 ఏళ్లు పూర్తికావస్తున్నా సరే.. చందమామ కెరియర్‌కు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నట్లు.. తను కూడా వచ్చిన ప్రతీ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటూ కెరియర్‌లో దూసుకుపోతోంది. ఇండస్ట్రీకి కొత్తగా ఎంత మంది హీరోయిన్లు వచ్చినా.. తన మీద మాత్రం ఎలాంటి ఎఫెక్ట్ పడలేదన్నది నిజం.

కెరియర్ బాగుంది సరే, పెళ్లి మాటేంటని అడిగితే మాత్రం సమాధానం దాటేస్తూ వస్తోంది కాజల్. చెల్లెలి పెళ్లి జరిగినా, తను మాత్రం ఇంకా సింగిల్ స్టేటస్ కంటిన్యూ చేస్తోంది. అయితే, ఈ మధ్య కాజల్‌కు గౌతమ్ అనే వ్యాపారవేత్తతో ఎంగేజ్‌మెంట్ జరిగిందని సోషల్ మీడియాలో న్యూస్ హల్ చల్ చేసింది. కాగా, దీనిపై క్లారిటీనిచ్చిన కాజల్ మేనేజర్.. నిశ్చితార్థం వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం కాజల్ కేవలం కెరియర్‌‌పైనే కాన్సంట్రేట్ చేసిందని.. ఇంకా పెళ్లి గురించి ఆలోచించలేదని చెప్పాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు మాలీవుడ్ సినిమాలతో చాలా బిజీగా ఉందని తెలిపాడు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తోంది కాజల్.


Next Story

Most Viewed