బిగ్ బ్రేకింగ్.. కడప ‘బద్వేల్’ బై పోల్ షెడ్యూల్ విడుదల

by Anukaran |
బిగ్ బ్రేకింగ్.. కడప ‘బద్వేల్’ బై పోల్ షెడ్యూల్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ : వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

అక్టోబర్ 8 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కాగా, అక్టోబర్ 11న నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ ప్రక్రియ జరుగనుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం షెడ్యూల్‌లో పేర్కొంది.

Advertisement

Next Story