జ్యోతిక ‘36 వయసులో’

by Shyam |   ( Updated:2023-05-19 07:45:02.0  )
జ్యోతిక ‘36 వయసులో’
X

అందరి కోసం జీవించడం ఒక అమ్మాయి సహజ గుణం.. కానీ ‘మీ కోసం కొంచెం టైమ్ కేటాయించండి, మీ కలలు పరిపూర్ణం చేసుకోండి’ అనే కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా 36 వయసులో. హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం.. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో జులై 24న రిలీజ్ కాబోతోంది.

36 ఏళ్ల వయసులో.. తను కన్న కలలు సాకారం చేసుకునే మహిళ పాత్రలో జ్యోతిక కనిపిస్తుండగా.. కామెడీ, ఎమోషన్స్‌తో కూడిన ట్రైలర్‌లో జ్యోతిక నటన ఆకట్టుకుంది. ఎనిమిదేళ్ల తర్వాత జ్యోతిక తెలుగులో చేస్తున్న సినిమా ఇదే కాగా.. ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన సినిమాలో సీనియర్ నటుడు రహమాన్ కీలక పాత్ర చేస్తున్నారు. సూర్య 2D ఎంటర్ట్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.

Advertisement

Next Story