- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతనే ఉంటే భార్యను చూసి ఎంత గర్వించేవాడో..
దిశ, వెబ్‌డెస్క్ : అతనే బతికుంటే తన భార్య సాధించిన విజయాన్ని చూసి ఎంత గర్వించేవాడో మాటల్లో చెప్పలేము. జీవిత భాగస్వామి అంటే కష్టసుఖాల్లో తోడుండటమే కాదు.. భర్తను అర్థం చేసుకోవడంతో పాటు ఆయన జయాపజయాల్లోనూ తోడుగా నిలవడం.. అంతేకాకుండా ఆయన చివరి కోరికను సాధించి నిజమైన భాగస్వామి అని నిరూపించుకుంది. ఇంతకూ ఆ వివాహిత ఏం చేసింది.. తన భర్త బతికుంటే ఎందుకు మురిసిపోయేవాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
దీపక్ నైన్ వాల్, జ్యోతి నైన్ వాల్ దంపతులు. దీపక్ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వర్తించేవాడు. 2018 జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో దీపక్ వీరమరణం పొందాడు. అప్పటికే దీపక్, జ్యోతి దంపతులకు ఇద్దరు పిల్లలు. భర్త చనిపోయాక అందరూ మహిళలలాగా అత్తమామల, అమ్మ వారింటి మీద ఆధారపడి జీవనం సాగించలేదు. పిల్లలతో ఒంటరిగా ఉంటున్న ఆమెకు భర్త చివరి కోరిక గుర్తొచ్చింది.
దీంతో ఎలాగైనా తన భర్త కోరికను నేరవేర్చాలని అనుకున్నది. పిల్లలను చూసుకుంటూనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ప్రిపరేషన్ సాగించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత నాలుగో ప్రయత్నంలో తన భర్త కోరికను నేరవేర్చి నిజమైన జీవిత భాగస్వామి అని నిరూపించుకుంది జ్యోతి. దీపక్ లాగే తాను కూడా ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయింది. ఈ విషయం తెలిసి దీపక్ మిత్రులు, కుటుంబ సభ్యులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భార్య అంటే భర్తకు తోడునీడలా ఉండటమే కాదు.. ఆయన సగంలో వదిలేసిన పనులను పూర్తి చేయడం జీవిత భాగస్వామి ధ్యేయమని జ్యోతి ప్రూవ్ చేసిందని పలువురు అభినందిస్తున్నారు. భార్య సాధించిన ఈ విజయాన్ని చూసి తన భర్తే గనుక ఉంటే ఎంతో గర్వించేవాడని సన్నిహితులు చెప్పుకుంటున్నారు.