- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విద్యార్థుల కోసం ప్రధాని ఆన్‌లైన్ పాఠాలు
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూతబడ్డాయి. దీంతో విద్యార్థులు స్కూల్స్‌కు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ఇంటి వద్ద నుంచే చదువుకుంటున్నారు. అంతే కాకుండా విద్యార్థులు ఇంటి వద్ద హోం వర్క్ చేసుకుంటున్నారు. కెనడాలో కూడా విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు నేర్చుకుంటూ ఇంటి వద్దే చదువుకున్నారు. అయితే విద్యార్థులకు హోం వర్క్ చేసే సమయంలో చాలా డౌట్స్ వస్తున్నట్లు కెనడా ప్రధాని దృష్టికి వచ్చింది. దీంతో ఆయన విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో విద్యార్థుల డౌట్స్ తీరుస్తానని చెప్పారు. పిల్లలు, వారి తల్లిదండ్రులకు హోమ్ వర్క్ చేసే సమయంలో వచ్చే డౌట్లను తీర్చడానికి తాను అందుబాటులో ఉంటానని చెప్పారు. నిరభ్యంతరంగా మీరు ఆన్‌లైన్‌లో తనను అడిగి అనుమానాలను నివృత్తి చేస్తానని చెబుతున్నారు. ట్రుడో ప్రధాని కాక ముందు అనేక చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. ఆ తర్వాత చాన్నాళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. బ్రిటిష్ కొలంబియాలోని వాంకోవర్ పాఠశాలలో గణితం, ఫ్రెంచ్ బోధించేవారు.