వాటర్ వార్: జూరాల దగ్గర గేట్లు మూసివేత.. రాకపోకలు బంద్

by Shyam |   ( Updated:2021-06-30 23:31:23.0  )
AP-TS water dispute
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటిని అందించే జూరాల ప్రాజెక్టు మీద నుండి రాకపోకలను నిషేధిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏపీతో రోజురోజుకు ముదురుతున్న జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు జోగులాంబ గద్వాల జిల్లాలోని మండలాల ప్రజలు- ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆత్మకూర్, అమరచింత, మక్తల్, దేవరకద్ర, మరికల్ ప్రాంతాలనుండి పెద్ద ఎత్తున రాకపోకలు సాగేవి.

ఈ ప్రాంతాల గుండా రాయలసీమకు వెళ్లే వాహనాలు సైతం కొన్ని రాకపోకలు సాగించేవి. ఈ క్రమంలో ప్రాజెక్టులకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే జూరాల ప్రాజెక్టుపై నుండి రాకపోకలు సాధించకుండా గేట్లు మూసివేశారు. దీంతో ప్రజలు, వాహనచోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed