ఎస్పీపై మాజీమంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్..

by Shyam |
ఎస్పీపై మాజీమంత్రి జూపల్లి షాకింగ్ కామెంట్స్..
X

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ పనికి రాని వ్యక్తి అని జిల్లా పోలీస్ అధికారిపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు షాకింగ్ కామెంట్స్ చేశారు. శనివారం నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా జిల్లా పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ.. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకువచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొల్లాపూర్ ప్రాంత పోలీసులు మచ్చ తెస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా జిల్లా స్థాయి అధికారి ఎందుకూ పనికిరాని వ్యక్తిగా ఇంటి నుంచి బయటకిరాడని ఆరోపించారు. వందశాతం ప్రజాస్వామ్య పద్దతుల్లో నిలదీస్తాం తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

మొదటిసారి పబ్లిక్‌గా ఓపెన్‌గా మాట్లాడుతున్నానని అన్నారు. కేవలం కొల్లాపూర్ గురించి మాట్లాడుతున్నానని ఇప్పటికీ.. ఈ నియోజకవర్గంలో పది ఘటనలు జరిగాయని తెలిపారు. పోలీసులు పైరవీకారులను, దోపిడీ చేసేవాళ్లను మాత్రమే గౌరవిస్తున్నారని.. ప్రజలపట్ల అమానుషంగా, అవమానకరంగా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యానికున్న శక్తి.. నాయకులు, అధికారులేనని గుర్తించాలని అన్నారు.

Advertisement

Next Story