- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు మంత్రి హరీష్ రావుతో ‘జూడాలు’ కీలక భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు పీజీ చదివేందుకు సర్కార్ ప్రత్యేకంగా కల్పించిన ఇన్‌సర్వీస్ కోటా రిజర్వేషన్లను రద్దు చేయాలంటూ నేడు జూనియర్ డాక్టర్లు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావును కలవనున్నారు. ఈ మేరకు శుక్రవారం పూర్తి స్థాయిలో చేపట్టాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లకు పీజీ చేసేందుకు సర్కార్ మెడికల్ కాలేజీల్లోని క్లినికల్ విభాగంలో 20 శాతం, నాన్క్లినికల్లో 30 శాతాన్ని సీట్లను కేటాయిస్తూ గవర్నమెంట్ జీవో నెం 155ను వారం రోజుల క్రితం విడుదల చేసింది.
దీన్ని అమలు చేస్తే రెగ్యులర్‌గా పీజీ చేస్తున్న వారికి సీట్లు తగ్గుతాయని, ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్ధులు వాపోతున్నారు. గత నాలుగు రోజులుగా టీచింగ్ఆసుపత్రుల్లో ఉదయం సమయంలో గంట సేపు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డీఎంఈ డా రమేష్‌రెడ్డి, మంత్రి పేషీ అధికారులు చర్చలు జరిపినా జూడాలు వెనక్కి తగ్గలేదు. దీంతో చేసేదేమీ లేక చివరకు స్వయంగా మంత్రి జూడాలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ప్రభుత్వ వైద్యులు కూడా మంత్రి హరీష్‌ను కలిసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగా రెండు వర్గాల వైద్యుల నిరసనలతో సర్కార్‌కు కొత్త తలనొప్పి షురూ కావడం గమనార్హం.