- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Junior Doctors Call Off Strike : సమ్మె విరమించిన జూడాలు..
X
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా సమయంలో తమ న్యాయపరమైన డిమాండ్లు నేరవేర్చారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. స్టైఫండ్స్, ఇన్సెంటివ్, కరోనా మరణానికి ఎక్స్ గ్రేషియా వంటివి జూడాల డిమాండ్లలో ప్రధానమైనవి. ఈ హామీలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ఇచ్చిందని అయితే అవి ఇంతవరకు అమలు కాలేదని జూడాలు మరోసారి ఆందోళనకు దిగారు.
ఈ నేపథ్యంలోనే జూడాలతో రెండు పర్యాయాలు చర్చలు జరిపిన ప్రభుత్వం ఎట్టకేలకు స్టైఫండ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంపు జనవరి నెల నుంచి అమలు కానున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. అయితే, తమ డిమాండ్ల పట్ల సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జూడాలు గురువారం సాయంత్రం ప్రకటించారు.
Advertisement
Next Story