ఎమ్మార్వో ఆఫీసులో మహిళకు ఘోర అవమానం.. బూతులు తిడుతూ..!

by Sumithra |   ( Updated:2021-09-25 08:44:23.0  )
ఎమ్మార్వో ఆఫీసులో మహిళకు ఘోర అవమానం.. బూతులు తిడుతూ..!
X

దిశ, ఖమ్మం టౌన్ : ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. ఖమ్మం నగరానికి చెందిన ఉషా అనే మహిళ కులధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంది. తన కుమార్తె బాస్కెట్ బాల్ క్రీడాకారిణి కావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు కుల ధృవీకరణ పత్రం కోసం గత నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతుంది.

శనివారం ఆ మహిళ తహశీల్దార్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్‌ను అత్యవసరమై అడుగగా ఆమెను మహిళ అని చూడకుండా ఆ అధికారి పరుష పదజాలంతో ధూషించాడు. దీంతో మహిళ ఏమి చేయాలో తెలియక కన్నీటి పర్యంతమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు అధికారిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story