ఆ కరోనా పెరగడం ఆర్థికవ్యవస్థకు అతిపెద్ద సవాలు

by Shyam |   ( Updated:2021-04-22 10:16:18.0  )
Shaktikanta das
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి పెరగడం వల్ల ఆర్థిక పునరుద్ధరణకు అతిపెద్ద సవాల్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) మినిట్స్ సమావేశం సందర్భంగా అన్నారు. కరోనా ప్రభావం నుంచి ఆర్థికవ్యవస్థ తిరిగి గాడిలో పడుతున్న సమయంలో కరోనా సెకెండ్ వేవ్ దారుణంగా విజృంభించడం అతిపెద్ద సవాలు అని, కోలుకుంటున్న ఆర్థికవ్యవస్థను సమర్థవంతంగా కాపాడుకోవడం అతిముఖ్యమైన దాస్ తెలిపారు. ఆర్థికవ్యవస్థ రికవరీకి తోడ్పడే విధంగా ద్రవ్య విధానం సానుకూలంగా ఉంటుందన్నారు.

వీలైనంత తొందరగా కొత్త కరోనా వేరియంట్‌ను నియంత్రించకపోతే ఆర్థిక పునరుద్ధరణ ప్రమాదంలో పడుతుందని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎంపీసీ సభ్యుడు మృదుల్ సాగర్ చెప్పారు. దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలతో ఆర్థికవ్యవస్థ వృద్ధిపై అస్పష్టత ఉందని దాస్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ వృద్ధి సానుకూలంగా ఉంటుందని, భారత ఎగుమతులు, పెట్టుబడులకు అనుకూలంగా మారుతుందన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటును ఆర్‌బీఐ ఎంపీసీ సమావేశంలో 10.5 శతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story