జేఎస్‌డబ్ల్యూ నికర లాభం 38 శాతం క్షీణత

by Harish |
జేఎస్‌డబ్ల్యూ నికర లాభం 38 శాతం క్షీణత
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జేఎస్‌డబ్ల్యూ(JSW) స్టీల్ నికర లాభం 37.77 శాతం క్షీణించి రూ. 1,593 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2,560 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 9.63 శాతం పెరిగి రూ. 19,264 కోట్లకు చేరుకుంది. ఈ త్రైమాసికంలో కంపెనీ ముడి ఉక్కు ఉత్పత్తి 38.5 లక్షల టన్నులుగా ఉన్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో పేర్కొంది. కంపెనీ మార్కెట్లు ముగిసిన తర్వాత ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. అంతకుముందే జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (JSW Steel) షేర్ ధర 1.44 క్షీణించి రూ. 321.05 వద్ద ట్రేడయింది.

Advertisement

Next Story

Most Viewed