- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోడ్డు ప్రమాదంలో ఆప్తులను పోగొట్టుకున్న బాధితుడిగా… ఎన్టీఆర్
దిశ, సినిమా: ‘జాతీయ రహదారి భద్రతా మాసం 2021’లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. నటుడిగా కాకుండా రోడ్డు ప్రమాదంలో ఆప్తులను పోగొట్టుకున్న బాధితుడిగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యానని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో అన్న, తండ్రిని కోల్పోయిన తనకు ఆ బాధేంటో తెలుసన్నారు. అలాంటి బాధను మీ ఇంట్లో వాళ్లకు కలిగించకుండా ఉండాలంటే.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మనకోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండాలని కోరారు.
అత్యంత ప్రమాదకర కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఉంది కానీ ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు వ్యాక్సిన్ లేదని, బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వల్లే రోడ్డు ప్రమాదాలను నివారించగలమన్నారు. మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులు, మన ఇంటి పక్కనే పహారా కాస్తున్న పోలీసుల సేవలను గుర్తించాలన్నారు. తల్లిదండ్రులను గౌరవించినట్లే మన పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కూడా గౌరవిద్దామని పిలుపునిచ్చారు తారక్.
కాగా ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను తారక్ జెండా ఊపి ప్రారంభించారు.