- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీహార్ సీట్ల కోసం సిట్టింగ్
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోరాడటానికి బీజేపీ, జేడీ(యూ)లు కసరత్తులు మొదలుపెట్టాయి. సీట్ల పంపకాలపై బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌లు శనివారం భేటీ అయ్యారు. జేడీ(యూ), ఎల్‌జేపీల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకుని విభేదాలను పరిష్కరించడానికి జేపీ నడ్డా హామీనిచ్చారు.
ఈ సమావేశంలో నడ్డాతోపాటు బీజేపీ జనరల్ సెక్రెటరీ, స్టేట్ ఇన్‌చార్జీ భూపేంద్ర యాదవ్, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ జైస్వాల్‌లు పాల్గొన్నారు. జేడీ(యూ)కు భిన్న వైఖరి తీసుకున్న ఎల్‌జేపీ ఎన్‌డీఏ కూటమిలో కొనసాగాలా?లేదా? అనేది ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ నిర్ణయించనున్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన కుమారుడు చిరాగ్ పాశ్వన్‌కే వదిలేశారని, రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కించడంలో చిరాగ్ సమర్థుడని భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వన్ ఇటీవలే పేర్కొన్నారు.
కాగా, ఎన్‌డీఏ పక్షాలు ఎల్‌జేపీకి సానుకూల సంకేతాలను పంపాయి. ఇదిలా ఉండగా, ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారపక్ష పార్టీల్లోకి బదిలీలు పెరిగాయి. కేవలం ఆర్జేడీ నుంచే గతనెల వ్యవధిలో ఏడుగురు ఎమ్మెల్యేలు జేడీ(యూ)లోకి జంప్ అయ్యారు. జూన్‌లో ఐదుగురు ఎమ్మెల్సీలు ఆర్జేడీ నుంచి జేడీ(యూ)లో చేరడం గమనార్హం.