చైనాతో జరిగిన చర్చల సంగతేంటి?

by Shamantha N |
చైనాతో జరిగిన చర్చల సంగతేంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దు వివాదం అంశంపై దౌత్యపరమైన చర్చలు విఫలమైతే మిలటరీ యాక్షన్‌కు సైన్యం సిద్ధంగా ఉందని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా స్పందించారు. చైనాతో ఇప్పటి వరకు జరిపిన చర్చలు సఫలం కాలేదా అని ప్రశ్నించారు.

కాగా, ఆదివారం బిపిన్ రావత్ మీడియాతో మాట్లాడుతూ.. ఎల్ఏసీ వెంట అతిక్రమణలు, దళాల మోహరింపు పైనే ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని, ఎల్‌ఏసీ వెంట యథాతథ స్థితిని పునరుద్ధరించడానికి చర్చలు సఫలం కాకపోతే సైనిక చర్యలకు వెనుకాడబోమని రావత్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed