మరో జర్నలిస్టు మృతి

by Shyam |
మరో జర్నలిస్టు మృతి
X

దిశ,షాద్ నగర్: కరోనా మహమ్మారికి మరో కలం యోధుడు మృత్యువాత పడ్డాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన ఓ టీవీ ఛానల్ విలేఖరి మాదిరాజు గిరి ఆదివారం మృతి చెందారు. గతవారం రోజులుగా కొవిడ్-19 వ్యాధితో బాధపడుతున్నాడు. పరిస్థితి విషమించడంతో గత నాలుగు రోజులక్రితం హైదరాబాద్ లోని జైదేవ్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జర్నలిస్ట్ గిరి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. దీంతో చికిత్స సమయంలో గుండెపోటు రావడంతో వెంటిలేటర్ పై ఉంచారు. అయితే పరిస్థితి చేయిదాటి పోవడంతో గిరి మృతి చెందాడు.

గిరికి భార్య పిల్లలు ఉన్నారు. వీడియో గ్రాఫర్ గా జీవితాన్ని ప్రారంభించిన గిరి అతి తక్కువ కాలంలో అందరి మన్ననలు చూరగొన్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రవేశించారు. మంచి పేరు సంపాదించారు. ఆయన అకాల మరణం పట్ల తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. గిరి మృతి పట్ల ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, వీర్లపల్లి శంకర్, కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్, నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి తో పాటు పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story