నిహారిక భర్త న్యూసెన్స్ కేసులో ట్విస్ట్.. అర్ధరాత్రి ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ

by Shyam |   ( Updated:2021-08-05 04:03:42.0  )
నిహారిక భర్త న్యూసెన్స్ కేసులో ట్విస్ట్.. అర్ధరాత్రి ఫ్రెండ్స్ తో కలిసి తాగుతూ
X

దిశ, వెబ్‌డెస్క్: అర్ధరాత్రి న్యూసెన్స్ కేసులో మెగా అల్లుడు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అపార్టుమెంట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నట్లు అపార్టుమెంట్ వాసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. తిరిగి వారిపై చైతన్య కూడా కేసు పెట్టారు. అయితే తాజా సమాచారం ప్రకారం పోలీసులు వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎవరు పెట్టిన కేసులు వారు వెనక్కి తీసుకున్నట్లు సమాచారం.

అసలు ఇంతకీ వారిద్దరిమద్య ఏంటీ గొడవ అంటే.. నిహారిక, చైతన్య నివసిస్తున్న అపార్టుమెంట్ లో చైతన్య ఆఫీస్ పెట్టాలని అనుకోగా.. అందుకు అపార్టుమెంట్ వాసులు ససేమిరా ఒప్పుకోలేదని, ఈ విషయమై వారి మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. ఆఫీస్ పేరుతో చైతన్య ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి రాత్రంతా తాగుతూ న్యూసెన్స్ చేస్తున్నారని, అంతేకాకుండా కోవిడ్ నిబంధనలను పాటించకుండా ప్లాట్స్ చుట్టూ తిరుగుతున్నారని అపార్టుమెంట్ వాసులు ఆరోపిస్తున్నారు. మరోపక్క చైతన్య అపార్టుమెంట్ వాసులే.. తమ పర్మిషన్ లేకుండా తమ ఆఫీస్ కి వచ్చి గొడవకు దిగారని, వారు గొడవ పడతుండడంతోనే మేము మాట్లాడాల్సివచ్చిందని తెలిపారు. ఇక ఇరువురు వాదనలు విన్న పోలీసులు వారికీ నచ్చజెప్పి కేసు వాపస్ తీసుకొని పంపించినట్లు సమాచారం. అయితే ఇది మెగాస్టార్ చిరంజీవి ఇంటి విషయం కాబట్టి పోలీసులు కూడా ఎక్కువ రాద్ధాంతం చేయకుండా రాజీ కుదిర్చారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story