వచ్చే నెలలో భారత్‌లోకి సింగిల్ డోస్ వ్యాక్సిన్

by Shamantha N |
Corona Vaccination
X

న్యూఢిల్లీ: అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన సింగిల్ డోసు వ్యాక్సిన్ వచ్చే నెలలో భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఇవి పరిమిత సంఖ్యలో అంటే వేల సంఖ్యలోనే అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. జాన్సన్ సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఇండియా) ఈ ప్రక్రియలో తలమునకలై ఉన్నట్టు సమాచారం. దీని ధర 25 అమెరికా డాలర్లుగా ఉండనున్నట్టు తెలిసింది. అతిశీతల గిడ్డంగుల్లో ఈ టీకాలను నిల్వ చేయాల్సిన అవసరం లేదు.

మనదేశంలో ఈ టీకాను ప్రవేశపెట్టడానికి జాన్సన్ అండ్ జాన్సన్ కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది. ఇండియాలో క్లినికల్ ట్రయల్స్‌ కోసం సన్నాహాలు చేసింది. కానీ, కేంద్ర ప్రభుత్వం విదేశీ టీకాలకు ఇచ్చిన మినహాయింపులతో ట్రయల్స్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి, మరింత త్వరగా అంటే వచ్చే నెలలో భారత్‌లోకి ఈ టీకాలు వస్తాయని కొన్నివర్గాలు తెలిపాయి. మైల్డ్, మాడరేట్ కేసుల్లో 66.3శాతం, సివియర్ కేసుల్లో 76.3శాతం సామర్థ్యం ఈ టీకా సొంతం. 100 శాతం హాస్పిటలైజేషన్‌ను నివారిస్తుంది. అత్యవసర వినియోగానికి అమెరికా ఎఫ్‌డీఏ ఫిబ్రవరిలో అనుమతించింది. కానీ, ఈ టీకాతో సీరియస్ బ్లడ్ క్లాటింగ్ డిజార్డర్‌ లింక్ ఉన్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో అక్కడ జాన్సన్ వ్యాక్సిన్ పంపిణీ కాస్త మందగించింది.

Advertisement

Next Story

Most Viewed