- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫెంటాస్టిక్ బీస్ట్స్.. ఫ్రాంచైజీకి జానీ డెప్ రిజైన్!
దిశ, వెబ్‌డెస్క్: హ్యారీ పోటర్ అభిమానులది ఒక ప్రత్యేక ప్రపంచం. హ్యారీ పోటర్ కథ ముగింపుకు వచ్చినా, ఆ మాయా ప్రపంచాన్ని అలాగే కొనసాగించే ఉద్దేశంతో అటు రచయిత్రి జేకే రౌలింగ్, ఇటు వార్నర్ బ్రదర్స్ స్టూడియో వారు ఫెంటాస్టిక్ బీస్ట్స్ సినిమాలను తీసుకొచ్చారు. ఈ సినిమాల్లోని కథ, హ్యారీ పోటర్ పుట్టడానికి ముందు చాలా ఏళ్ల క్రితం జరిగినది. ఈ సినిమాల్లో ఇప్పటికే రెండు సినిమాలు విడుదలై ఘనవిజయం సాధించాయి. 2016లో వచ్చిన ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ వేర్ టు ఫైండ్ దెమ్’, 2018లో వచ్చిన ‘ఫెంటాస్టిక్ బీస్ట్స్ అండ్ ద క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్‌వాల్డ్’లలో విలన్ గ్రిండెల్‌వాల్డ్ పాత్రను ప్రముఖ నటుడు జానీ డెప్ పోషించారు. విభిన్న విలనియస్ కోణాలున్న ఈ పాత్రకు ఆయన వంద శాతం న్యాయం చేయడంతో హ్యారీపోటర్ అభిమానులు ఎగిరి గంతేశారు. కానీ ఇక నుంచి ఫెంటాస్టిక్ బీస్ట్స్ సినిమాల్లో జానీ డెప్ కనిపించరు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. వార్నర్ బ్రదర్స్ కంపెనీతో తన గ్రిండెల్‌వాల్డ్ పాత్రకు రాజీనామా చేస్తున్నట్లు జానీ డెప్ తెలియజేస్తూ ఒక లెటర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థ కూడా స్పష్టం చేసింది.
గత కొన్ని నెలలుగా జానీ డెప్, ఆయన మాజీ భార్య, నటి ఆంబర్ హర్డ్‌ల మధ్య కొనసాగుతున్న కోర్టు వివాదాలు, 2015-17 మధ్య కాలంలో వారిద్దరి మధ్య జరిగిన గొడవల వల్ల జానీ మీద వ్యతిరేకత వస్తోంది. ఈ పరిణామానికి కూడా పరోక్షంగా ఆ వివాదాలే కారణమని తెలుస్తోంది. గ్రిండల్‌వాల్డ్ పాత్ర ఒక స్వలింగ సంపర్కుడు కావడం, ఈ విషయం గురించి జేకే రౌలింగ్ కూడా కొన్ని ట్రాన్స్‌జెండర్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు మొదలైన దగ్గరి నుంచి ఇలా ఏదో ఒక వివాదం రావడం, ఇప్పుడు ఏకంగా ప్రధాన పాత్రధారి తప్పుకోవడం చూస్తుంటే ఈ సిరీస్‌లో ఐదు సినిమాలను అందిస్తామని ప్రకటించిన వార్నర్ బ్రదర్స్ సంస్థ, ఆ మాటను నిలబెట్టుకుంటుందో లేదోనని అభిమానులు కంగారుపడుతున్నారు. మరి గ్రిండెల్‌వాల్డ్ పాత్రను జానీ డెప్ స్థాయిలో పోషించగల మరో నటుడు ఎవరైనా దొరుకుతారేమో చూడాలి!