గుంటూరులో ఘోరం.. ఆత్మహత్య పై మాట్లాడుతూ సెల్ఫీ వీడియో

by srinivas |   ( Updated:2021-09-12 07:03:40.0  )
suisaide
X

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా నరసరావుపేటలో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. నేహీమియ అనే వ్యక్తి అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని బాధితుడు జాన్ వెస్లీ సెల్ఫీ వీడియోలో ఆరోపించాడు. అంత వడ్డీలు తాను కట్టలేనని ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, నెహేమియా బెదిరింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. పది రూపాయల వడ్డీ తాను కట్టలేను అని చెప్పినా వినకుండా.. కేసులు పెట్టి వేధిస్తున్నారని బాధితుడు ఆరోపించాడు. అలాగే తనకు తెలియకుండా తన ఇంటి పత్రాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టాడని వాపోయాడు.

ఆ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వెస్లీ సెల్ఫీ వీడియోలో బోరున విలపించాడు. తన భార్య, పిల్లలు కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను కోరాడు. తాను ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నానని.. ఇక తనకు చావే శరణ్యమని చెప్తూ వీడియో ఆఫ్ చేశాడు. జాన్‌వెస్లీ విడుదల చేసిన సెల్ఫీ వీడియో వైరల్ అవ్వడంతో అది కాస్త కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారంతా జాన్ వెస్లీ కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story