జోఫ్రా ఆర్చర్ సర్జరీ సక్సెస్

by Shyam |
జోఫ్రా ఆర్చర్ సర్జరీ సక్సెస్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నెల రోజుల వ్యవధిలో మరోసారి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇండియా పర్యటనకు వచ్చిన ఆర్చర్ మధ్యలోనే చేతి వేలి గాయం కారణంగా ఇంగ్లాండ్ వెనుదిరిగి వెళ్లాడు. దీంతో ఐపీఎల్‌లో కూడా ఆడలేదు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకున్న ఆర్చర్ ససెక్స్ తరపున కౌంటీ క్రికెట్ కూడా ఆడటం ప్రారంభించాడు. అయితే అతడి మో చేతి గాయం తిరగబెట్టడంతో అర్దాంతరంగా కౌంటీ క్రికెట్ నుంచి కూడా వైదొలగాడు. బుధవారం ఆర్చర్ మోచేతికి డాక్టర్లు సర్జరీ నిర్వహించారు. అయితే అతడు కోలుకొని ఎన్ని రోజులకు క్రికెట్ ఆడతాడనే విషయంపై మాత్రం వైద్యులు స్పష్టతను ఇవ్వలేదు. సర్జరీ అనంతరం జోఫ్రా ఆర్చర్ రీహాబిలిటేషన్ కోసం వెళ్లనున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వైద్య బృందం తెలిపింది. పూర్తిగా కోలుకున్న తర్వాత మాత్రమే అతడు క్రికెట్‌లోకి తిరిగి వస్తాడని ఈసీబీ తెలిపింది. ఆగస్టులో ఇండియాతో జరుగనున్న టెస్ట్ సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండాడో లేదో అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని ఈసీబీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Advertisement

Next Story