- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SECL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అప్లికేషన్ కు చివరి తేదీ ఎప్పుడంటే..
దిశ, ఫీచర్స్ : నిరుద్యోగులకు ఈ ఖాళీని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ( SECL ) శుభవార్త తెలిపింది. SECL లో 1425 ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. గ్రాడ్యుయేషన్, డిప్లొమా పూర్తిచేసుకున్న నిరుద్యోగుల ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు 27 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. SECL అధికారిక వెబ్‌సైట్ secl-sil.in లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాలి.
ఖాళీల వివరాలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు 350, టెక్నీషియన్ అప్రెంటీస్‌కు 1,075 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లో మైనింగ్ ఇంజినీరింగ్ 200, మెకానికల్ ఇంజినీరింగ్ 50, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50, సివిల్ ఇంజనీరింగ్ 30, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 20 పోస్టులు ఉన్నాయి.
టెక్నీషియన్ అప్రెంటీస్‌లో మైనింగ్ ఇంజినీరింగ్/మైనింగ్ అండ్ మైనింగ్ సర్వే 900, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 75, మెకానికల్ ఇంజనీరింగ్ 50, సివిల్ ఇంజనీరింగ్ 50 పోస్టులు ఉన్నాయి.
నైపుణ్యాలు..
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు, అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా కలిగి ఉండాలి. దరఖాస్తు చేయడానికి, వయస్సు 13 ఫిబ్రవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు ఇలా చేసుకోండి ?
కంపెనీ అధికారిక వెబ్‌సైట్ secl-sil.inకి వెళ్లండి.
ఇక్కడ ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ ?
ఇంజనీరింగ్/డిప్లొమాలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరింత సమాచారం కోసం, అభ్యర్థులు విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్చి 15 నుంచి జరుగుతుంది.