భారీగా బ్యాంకు ఉద్యోగాలు.. శిక్షణతో పాటు స్టైపెండ్‌, అలవెన్సులు

by Harish |
భారీగా బ్యాంకు ఉద్యోగాలు.. శిక్షణతో పాటు స్టైపెండ్‌, అలవెన్సులు
X

దిశ, కెరీర్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్, దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ లో భాగంగా ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 5000

తెలంగాణ - 106

ఆంధ్రప్రదేశ్ - 141

కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:

జనరల్ - 2159

ఓబీసీ - 1162

ఎస్సీ - 763

ఎస్టీ - 416

ఈడబ్ల్యూఎస్- 500

ట్రైనింగ్ పీరియడ్: ఒక ఏడాది.

అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయసు: మార్చి 31, 2023 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

స్టైపెండ్: రూరల్ బ్రాంచిలో రూ. 10,000, అర్బన్ బ్రాంచ్ లో రూ. 12,000, మెట్రో బ్రాంచ్ లో అయితే రూ. 15,000తో పాటు అలవెన్సులు కూడా ఉంటాయి.

ఎంపిక: ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: రూ. 800 (ఎస్సీ,ఎస్టీ మహిళా అభ్యర్థులకు రూ. 600; దివ్యాంగులకు రూ. 400).

చివరి తేదీ: ఏప్రిల్ 3, 2023.

పరీక్ష తేదీ: ఏప్రిల్ రెండో వారం/2023.

వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in

Advertisement

Next Story