- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC జియో సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
దిశ, ఫీచర్స్ : UPSC జియో సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ పరీక్షల అడ్మిట్ కార్డ్ లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in కి లాగిన్ అయి అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. UPSC జియో సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 20 సెప్టెంబర్ 2023న ప్రారంభమై అక్టోబర్ 10, 2023 వరకు కొనసాగాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌ను ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inకి లాగిన్ అవ్వండి.
వెబ్‌సైట్ హోమ్ పేజీలో తాజా నోటీసుల లింక్ పై క్లిక్ చేయండి.
తర్వాత UPSC జియో సైంటిస్ట్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
తదుపరి పేజీలో డౌన్‌లోడ్ అడ్మిట్ కార్డ్ లింక్ కి వెళ్లండి.
దీని తర్వాత అభ్యర్థించిన వివరాలతో లాగిన్ అవ్వండి.
లాగిన్ అయిన తర్వాత, అడ్మిట్ కార్డ్ స్క్రీన్ పై కనిపిస్తుంది.
తరువాత అడ్మిట్ కార్డ్‌ని చెక్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత వివరాలను జాగ్రత్తగా చెక్ చేయండి. అభ్యర్థుల పేర్లతో పాటు, అడ్మిట్ కార్డ్‌లో తల్లిదండ్రుల పేరు, రోల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్షా కేంద్రం చిరునామా, పరీక్ష తేదీ, పరీక్ష సమయం వివరాలను చెక్ చేసుకోండి.
పరీక్ష తేది ?
UPSC జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం జియో సైంటిస్ట్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమ్స్ పరీక్ష 18 ఫిబ్రవరి 2024న నిర్వహించనున్నారు. ఈ ప్రిలిమ్స్ పరీక్షలో ఎంపికైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావాలి. ఈ ఖాళీకి సంబంధించిన మెయిన్స్ పరీక్ష 22 జూన్ 2024న జరుగుతుంది.