- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2)- 2023
దిశ, కెరీర్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తున్న కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్ఈ) ద్వారా త్రివిధ దళాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో ఎంపికైతే శిక్షణ తర్వాత త్రివిధ దళాల్లో సేవలు అందించవచ్చు. డిగ్రీ పూర్తి చేసుకున్న అవివాహిత పురుషులు, మహిళలు జూన్ 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష: యూపీఎస్సీ - సీడీఎస్ (2) - 2023
మొత్తం ఖాళీలు: 349
ఖాళీల వివరాలు :
ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఐ), డెహ్రాడూన్ - 100
ఇండియన్ నేవల్ అకాడమీ (ఐఎన్ఏ), ఎజిమల - 32
ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ), హైదరాబాద్ - 32
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్‌సీ మెన్ నాన్ టెక్నికల్ - 169
ఆపీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (మద్రాస్), ఓటీఏ ఎస్ఎస్‌సీ ఉమెన్ నాన్ టెక్నికల్ - 16
విద్యార్హత: మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
నేవల్ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
మహిళలు ఓటీఏ ఎస్ఎస్‌సీ నాన్ టెక్నికల్ పోస్టులకు మాత్రమే అర్హులు.
వయసు: ఇండియన్ మిలిటరీ అకాడమీ, నేవల్ అకాడమీలకు జులై 2, 2000 కంటే ముందు, జులై 1, 2005 తర్వాత జన్మించిన వారు అనర్హులు.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు జులై 2, 2000 కంటే ముందు, జులై 1, 2004 తర్వాత జన్మించిన వారు అనర్హులు.
ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు జులై 2, 1999 కంటే ముందు, జులై 1, 2005 తర్వాత జన్మించిన వారు అనర్హులు.
ఎంపిక: రెండు దశల్లో ఎంపిక చేస్తారు.
మొదటి దశలో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంటర్వ్యూ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్ష .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. ఇతరులు రూ. 200 చెల్లించాలి.
చివరి తేదీ: జూన్ 6, 2023
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 3, 2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం...
వెబ్‌సైట్: https://upsc.gov.in/