- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుడ్‌న్యూస్: 5,388 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
దిశ, కెరీర్: ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల్లో ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించడానికి ప్రభుత్వం వాచ్‌మెన్ పోస్టులను భర్తీ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లోని వాచ్‌మెన్ ఉద్యోగాలకు సంబంధించి నియామకాలకు ఏపీ కేబినెట్ ఆమోదించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,388 పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు గౌరవ వేతనంగా రూ. 6 వేలు అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. ఈ పోస్టులకు ఇప్పటికే పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం కింద ఆయాలుగా పనిచేస్తున్న మహిళల భర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. గ్రామం లేదా వార్డులో మాజీ సేవా పురుషులకు అనగా ఎక్స్ సర్వీస్ మెన్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఈ రెండు విభాగాలకు సంబంధించిన వారు లేకపోతే పేరెంట్స్ కమిటీ సూచనల మేరకు అర్హత గల వ్యక్తిని నియమించుకునే అవకాశం ఇచ్చారు.