జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ .. పోస్టులు ఎన్నంటే ?

by Harish |
జిల్లా జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ .. పోస్టులు ఎన్నంటే ?
X

దిశ, కెరీర్: ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీసులో డిస్ట్రిక్ట్ జడ్జి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాల భర్తీకి అమరావతిలోని ఏపీ స్టేట్ హైకోర్టు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

జిల్లా జడ్జి (ఎంట్రీ లెవల్ పోస్టులు) - 10

అర్హత: నిర్దేశిత న్యాయస్థానాల్లో అడ్వకేట్‌గా కనీసం 7 సంవత్సరాలు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఇతర అర్హతలుండాలి.

వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ. 1,44,840 నుంచి రూ. 1,94,660 ఉంటుంది.

ఎంపిక: స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా -వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ. 1500 (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ. 800)

చివరి తేదీ: మే 25, 2023.

వెబ్‌సైట్: https://aphc.gov.in

Next Story

Most Viewed