- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) - 2023
దిశ, కెరీర్: ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది. ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు. తాజాగా జులై -2023కు సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ వెలువడింది.
పరీక్ష వివరాలు:
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్ జులై 2023)
అర్హతలు:
పేపర్ -1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతి ఉత్తీర్ణత తో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ)/డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్ -2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ /బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ)/బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యకేషన్ (బీఈఎల్ఈడీ)/బీఎస్సీఈడీ/బీఏఈడీ/బీఎస్సీఈడీ ఉత్తీర్ణత ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్ /ఓబీసీ కేటగిరిలకు రూ. 1000 (పేపర్ 1 లేదా పేపర్ 2), రూ. 1200 (పేపర్ 1, పేపర్ 2 రెండూ).
ఎస్సీ /ఎస్టీ/దివ్యాంగులకు రూ. 500 (పేపర్ 1 లేదా పేపర్ 2), రూ. 600 (పేపర్ 1, పేపర్ 2 రెండూ)
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 26, 2023.
సీబీటీ పరీక్ష: జులై 2022 నుంచి ఆగస్టు, 2023 మధ్య నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: https://ctet.nic.in