ABYBP ప్రోగ్రామ్..పీజీ డిప్లొమా, స్టైపెండ్.. రూ. 4.42 లక్షల జీతంతో బ్యాంక్ ఉద్యోగం

by Harish |
ABYBP ప్రోగ్రామ్..పీజీ డిప్లొమా, స్టైపెండ్.. రూ. 4.42 లక్షల జీతంతో బ్యాంక్ ఉద్యోగం
X

దిశ, కెరీర్: యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ (ఏబీవైబీపీ) ఆధ్వర్యంలో అభ్యర్థులకు పీజీ డిప్లొమా అందిస్తుంది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసిన వారిని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులో నియామకం చేస్తారు. అర్హులైన అభ్యర్థుల నుండి యాక్సిస్ బ్యాంక్ దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

యాక్సిస్ బ్యాంక్ యంగ్ బ్యాంకర్స్ ప్రోగ్రామ్ (ఏబీవైబీపీ) 2023 -పీజీ డిప్లొమా

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.

అర్హత: 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.

చివరి ఏడాది పరీక్షలు రాసిన అభ్యర్థులు అర్హులే.

జాయిన్ అయిన తర్వాత ఒరిజినల్ ఫైనల్ ఇయర్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించాలి.

గ్రాడ్యుయేషన్ డిగ్రీ (10+2+3) ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష లేదా వీడియో ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష సిలబస్: వెర్బల్ ఎబిలిటీ, అనలిటికల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రిటర్న్ ఇంగ్లీష్ టెస్ట్, రిజనింగ్ కాంప్రెహెన్షన్ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

స్టైపెండ్: ఎంపికైన వారికి మొదటి ఆరు నెలలు రూ. 5,000, తర్వాత రూ. 12,000 చెల్లిస్తారు.

జీతం: కోర్సు పూర్తయి జాబ్ లో చేరిన తర్వాత రూ. 4.42 లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: ఫిబ్రవరి 12, 2023

వెబ్‌సైట్: https://axisbankybp.online-ap1.com

Advertisement

Next Story

Most Viewed