- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ గురుకులాల్లో 134 ఆర్ట్ డ్రాయింగ్ టీచర్ ఖాళీలు
దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిన 134 ఆర్ట్, డ్రాయింగ్ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
ఆర్ట్ టీచర్ - 132
డ్రాయింగ్ టీచర్ (డీఈపీడీఎస్సీ అండ్ టీపీ) - 2
మొత్తం ఖాళీల సంఖ్య: 134.
ఆర్ట్ టీచర్ ఖాళీల వివరాలు:
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాలు - 16
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు - 6
మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాలు- 72
తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకులాలు - 38
వేతనం: నెలకు ఆర్ట్ టీచర్‌కు రూ. 31,040 నుంచి రూ. 92,050; డ్రాయింగ్ టీచర్‌కు రూ. 33,750 నుంచి రూ. 99,310 ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 24, 2023.
చివరి తేదీ: మే 24, 2023.
నోట్: పూర్తి వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు.
వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in