10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్.. రైల్వేలో మరో బంపర్ రిక్రూట్‌మెంట్..

by Sumithra |
10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్.. రైల్వేలో మరో బంపర్ రిక్రూట్‌మెంట్..
X

దిశ, ఫీచర్స్ : రైల్వేలో ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు శుభవార్త. భారతీయ రైల్వే 2800 కంటే ఎక్కువ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను ప్రకటించింది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ 29 జనవరి 2024 నుంచి ప్రారంభం కాగా 28 ఫిబ్రవరి 2024 వరకు కొనసాగుతుంది. దక్షిణ రైల్వే ద్వారా ఈ నియామకం జరగనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sr.Indianrailways.gov.in కి లాగిన్ అయ్యి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో దక్షిణ రైల్వే మొత్తం 2860 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఫిట్టర్, వెల్డర్‌తో సహా అనేక పోస్ట్‌లు ఉన్నాయి. ఈ పోస్టులన్నీ దక్షిణ రైల్వేలోని వివిధ డివిజన్లలో భర్తీ చేయనున్నారు.

విద్యార్హత..

ఫిట్టర్ పోస్టులకు కనీసం 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ అయితే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (కనీసం 50% మొత్తం మార్కులతో) 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాల కోసం, అభ్యర్థులు విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ ప్రకటనను తనిఖీ చేయవచ్చు.

వయోపరిమితి..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఓబీసీకి మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఇచ్చారు.

దరఖాస్తు రుసుము..

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థి సర్వీస్ ఛార్జీతో పాటు రూ. 100 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. అయితే SC/ST/PWBD/మహిళా అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇలా దరఖాస్తు చేసుకోండి

దక్షిణ రైల్వే అధికారిక వెబ్‌సైట్ sr. indianrailways.gov.in కి లాగిన్ అవ్వండి.

హోమ్ పేజీలో ఇచ్చిన కంబైన్డ్ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటీస్‌ పై క్లిక్ చేయండి.

ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ చేసి అప్లై చేయండి.

రుసుము చెల్లించి సమర్పించండి.

Advertisement

Next Story

Most Viewed