- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Unstoppable : అన్‌స్టాపబుల్ సెట్‌లో రామ్ చరణ్, బాలయ్య.. ఆకట్టుకుంటున్న వీడియో
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం నాలుగో సీజన్ కూడా విజయవంతంగా రన్ అవుతోంది. ఇక ఇప్పటికే ఏడు ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ షో కి లాస్ట్ టైం విక్టరీ వెంకటేష్ వచ్చి సందడి చేశారు. ఇక తాజాగా ఈ షోకి రామ్ చరణ్ రాబోతున్నట్లు ఆహా టీమ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ జనవరి 10న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా అన్‌స్టాపబుల్ షోకి రామ్ చరణ్ వచ్చారు. ఈ క్రమంలో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజాగా రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షో షూటింగ్‌కి వచ్చారు. అయితే కారు నుంచి దిగి వస్తున్న అతన్ని చూసి బాలయ్య బ్రో అని అనమంటాడు కానీ, చరణ్ సార్ అని అంటాడు. అప్పుడు బాలకృష్ణ నువ్వు బ్రో అంటేనే సెట్‌లోకి రానిస్తాను లేదంటే నా సెట్‌లోకి నీకు పర్మిషన్ లేదు అని అంటునే ఆలింగనం చేసుకుంటాడు. అలా ఫన్నీ ఫన్నీగా వీరిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ఎపిసోడ్ జనవరి ఫస్ట్ వీక్‌లో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.