1,50,000 జీతంతో భారీ ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు

by Anjali |
1,50,000 జీతంతో భారీ ప్రభుత్వ ఉద్యోగాలు.. ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు శుభవార్త. తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కేంద్రాలు, కార్యాలయాల్లో 444 అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వీటిలో 76 సెక్షన్ ఆఫీసర్ పోస్టులు, 368 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో 19 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కాగా జనవరి 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 14 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రాతపరీక్ష (స్టేజ్-1, స్టేజ్-2), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు.

విభాగాలు- జనరల్, ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్, స్టోర్స్ అండ్‌ పర్చేజ్

అర్హత- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయస్సు- 33 ఏళ్లు మించకూడదు.

జీతం- రూ.47,600 – రూ.1,51,100

అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- 368 పోస్టులు

విభాగాలు- జనరల్, ఫైనాన్స్ అండ్‌ అకౌంట్స్, స్టోర్స్ అండ్‌ పర్చేజ్

అర్హత- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు- 33 ఏళ్లు మించకూడదు.

జీతం- రూ.44,900 – రూ.1,42,400

దరఖాస్తు ఫీజు- రూ.500. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు -పేపర్-1, పేపర్-2 అహ్మదాబాద్, బెంగళూరు, ధన్‌బాద్, డెహ్రాడూన్, ఢిల్లీ, గువాహటి, హైదరాబాద్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, జైపూర్, జమ్మూ, జంషెడ్‌పూర్, కోల్‌కతా, లక్నో, నాగ్‌పూర్, పుణే, తిరువనంతపురం.

పరీక్ష కేంద్రాలు -పేపర్ 3- హైదరాబాద్, బెంగళూరు, భోపాల్, చండీగఢ్, చెన్నై, ఢిల్లీ(NCR), కోల్‌కతా, లక్నో, జంషెడ్‌పూర్, పుణే, గువాహటి.

దరఖాస్తు ప్రారంభ తేదీ- డిసెంబర్‌ 08, 2023.

దరఖాస్తు చివరితేది- జనవరి 12, 2024

ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed