- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు ఊహించని షాక్.. కొత్త జిల్లాల్లో ఒక్క పోస్టు లేదు..!
దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త జిల్లాల్లో ఖాళీలు కనిపించడం లేదు. ఏ శాఖలోనూ నూతనంగా భర్తీ చేసేందుకు ఒక్క పోస్టు కూడా దొరకడం లేదు. ఉద్యోగుల విభజన, జిల్లాల వారీగా కేటాయింపులు పూర్తి చేస్తే ఖాళీల వివరాలు బయటకు వస్తాయని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటిస్తూనే ఉంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి ఖాళీలను గుర్తించి కొలువుల భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. కానీ ఇప్పుడు జిల్లాల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేదు. ప్రస్తుతం పాత జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్‌ను కొత్త జిల్లాలకు బదిలీ చేస్తోంది. అంతేకానీ జనాభా ప్రాతిపదికన కొత్త కేడర్ స్ట్రెంత్ ఖరారు చేయలేదు. ఫలితంగా ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేస్తోంది.
సర్దు‘పాట్లు’.. నో వెకెన్సీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులను కొత్త జోనల్ ప్రకారం సర్దుబాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో పది జిల్లాల వారిగా నియమించినవారిని ఇప్పుడు 33 జిల్లాలకు సర్దుబాటు చేస్తున్నారు. అంతేకానీ ఏ శాఖలో ఎంత మంది కావాలి, అక్కడ ఏ మేరకు అవసరం అనే వివరాల జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదు. అంటే కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్ టూ సర్వ్కింద కేటాయించిన ఉద్యోగులను ఇప్పుడు అధికారికంగా బదిలీ చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలన్నీ పది జిల్లాల ప్రకారమే జరిగాయి.
ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి. ఇకపై భర్తీ చేసే పోస్టులకు 33 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకోనున్నారు. అయితే అంతకన్నా ముందే ఇప్పటికే ఉన్న ఉద్యోగులను 33 జిల్లాలకు సర్దుబాటు చేసే ప్రక్రియనే చేపట్టారు. దీంతో ఆయా శాఖల్లో ఉద్యోగాల ఖాళీలు తేలుతుందని ఓ సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఉద్యోగులు కొత్త జోనల్ విధానంతో జిల్లాలు, జోనల్, మల్టీ జోనల్ వారిగా బదిలీ అవుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త ప్రభుత్వ ఉద్యోగాలపై నిరుద్యోగుల్లో సందేహాలు నెలకొంటున్నాయి. గతంలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతీ జిల్లాకు వెయ్యి నుంచి రెండువేల కొత్త కొలువులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ప్రస్తుతం ఉన్న ఉద్యోగులనే 33 జిల్లాలకు సర్దుబాటు చేస్తుండటంతో ఖాళీగా ఉన్న పోస్టులు పాత ఉద్యోగులతోనే నిండిపోతాయి. మరోవైపు ఏ జిల్లాకు ఎంతమంది జనాభా, దాన్ని అనుసరించి ఎంతమంది ఉద్యోగులు కావాలనే వివరాలు తేల్చలేదు. దీంతో ఉన్నవారితోనే జిల్లాల్లో పోస్టులు భర్తీ అవుతున్నాయి. అంతేకానీ కొత్త పోస్టులు కనిపించడం లేదు. ఇప్పుడు ఒక చోట నుంచి మరోచోటికి వెళ్లినా అక్కడ ఖాళీలు ఏర్పాటు కావడం లేదు. కేవలం సర్దుబాటు ప్రక్రియ మాత్రమే చేస్తున్నారు. పాత జిల్లాల్లో పని చేసిన వారిని కొత్త జిల్లాల వారీగా సర్దుబాటు చేస్తే ఖాళీలు కనిపించడం లేదని అధికారులు కూడా స్పష్టంగా చెబుతున్నారు.
శాంక్షన్ పోస్టులు పెంచలే
కొత్త జిల్లాల్లో పాత జిల్లాల ఉద్యోగులనే సర్దుబాటు చేస్తూ వస్తున్నారు. ప్రెసిడెన్షియల్ఆర్డర్తర్వాత శాంక్షన్డ్పోస్టులు పెంచుతామని గతంలో చెప్పిన ప్రభుత్వం తీరా ఈ సమయంలో 317 జీవో ప్రకారం చేతులెత్తేసినట్లే చేస్తోంది. ఈ జీవో ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో సర్దుబాటు చేసుకున్నట్లుగానే ఇప్పుడూ అదే తరహాలో సర్దుబాటు చేసుకోవాలని తేల్చిచెప్పింది. దీంతో కొత్త జిల్లాల్లో పోస్టులపై ఆశలు తేలిపోతున్నాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్పోస్టుల ఖాళీల గుర్తింపు చేయడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వేల సంఖ్యలో కొత్తగా శాంక్షన్డ్ పోస్టులు వస్తాయనుకుంటే అది ఉత్తిదేనని తేలిపోయింది. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని, దీంతో కొత్త పోస్టులు వస్తాయని ఇన్నాళ్లూ ఊదరగొట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తకుండా కేడర్ స్ట్రెంత్ ప్రక్రియను కానిచ్చేస్తోంది.
మరోవైపు కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లలో ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో కొన్నింటిని భర్తీ చేసుకున్నారు. ఇప్పుడు వాటిని ముట్టుకోకున్నా.. ఆ స్థానాలను ఖాళీ చూపించడం లేదు. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వ విభాగాల్లో 2,95,571 శాంక్షన్డ్ కేడర్స్ట్రెంత్ఉండగా.. ఇన్‌స్టిట్యూషన్లలో 52,988 స్ట్రెంత్ ఉంది. మొత్తంగా 3,48,559 డైరెక్ట్క్యాడర్స్ట్రెంత్ ఉంది. మిగిలిన కేడర్కలిపితే మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల స్ట్రెంత్ 4,43,094. ఇందులోనే రెండు లక్షల ఖాళీలు ఉన్నాయని పీఆర్సీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఏడాదిగా ఊరిస్తూ వస్తోంది. ఖాళీలు గుర్తించి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు ఒక్క జిల్లాలో కూడా ఖాళీలు కనిపించడం లేదు.
క్షేత్రస్థాయిలో ఘోరమే
పాత జిల్లాలు, పాత మండలాల నుంచే ఉద్యోగులను సర్దుబాటు చేయడంతో కొత్త వాటితో పాటు పాత వాటిలోనూ ఖాళీలు ఏర్పడ్డాయి. ప్రతి విభాగంలోనూ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 592 మండలాలు ఉన్నాయి. ఒక్క మండలం కింద సగటున 15 నుంచి 20 గ్రామాలున్నాయి. ఉదాహరణగా ఒక తహసీల్దార్ కార్యాలయంలో కనీసం 20 మంది ఉద్యోగులు అవసరం. ఒక తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు జూనియర్అసిస్టెంట్లు, ఒక టైపిస్ట్, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, ఒక సర్వేయర్, ఒక చైన్మన్, రికార్డు అసిస్టెంట్, ఇద్దరు అటెండర్లు, ఒక వాచ్మెన్ఉంటారు. కానీ ఉద్యోగ సంఘాల లెక్కల ప్రకారం 80 శాతం మండలాల్లో 13 మందిలోపే పనిచేస్తున్నారు. ప్రతి గ్రామానికి వీఆర్ఏ, వీఆర్వోలు ఉంటారు. ఇప్పుడు వీఆర్వో వ్యవస్థ తీసేయడంతో ఉన్నవారిపైనే అధిక పని భారం పడుతోంది. కానీ ఈ ఖాళీలను చూపించకుండా.. ఉన్నవారితోనే అడ్జెస్ట్ చేస్తోంది. దీంతో జిల్లాలు, మండలాల్లో ఖాళీలు కనిపించడం లేదు. జిల్లాస్థాయి పోస్టుల విభజన, కేటాయింపుల తర్వాత కనీసం 16 జిల్లాల్లో అసలు ఖాళీలు కనిపించడం లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. వీటిని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది.
కొత్త జిల్లాల వారీగా కేడర్ స్ట్రెంత్ తేల్చాల్సిందే..
ప్రస్తుతం జనాభా ప్రాతిపదికన ఉద్యోగుల పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పాత జిల్లాల్లో ఉన్న వారిని కొత్త జిల్లాల్లో అడ్జెస్ట్ చేస్తున్నారు. దీంతో ఖాళీలు తేలడం లేదు. ఇలాగైతే కొత్త పోస్టులు కూడా కనిపించడం లేదు. పాత జిల్లాల ఆధారంగా కేడర్స్ట్రెంత్ను తీసుకోవడం తప్పు. కొత్త జిల్లాల ప్రకారం జనాభా ప్రాతిపదికన కేడర్స్ట్రెంత్తేల్చితే ఆ తర్వాత ఎంత మంది అవసరమో తెలుస్తోంది. పంచాయతీరాజ్‌శాఖలో గ్రామ పంచాయతీలను గ్రేడ్‌లుగా విభజించలేదు. అలా విభజించకుండా గ్రేడింగ్ఇచ్చి బదిలీలు చేస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. కొత్త జిల్లాల వారీగా స్థానికతను చూడకుండా కేవలం సీనియార్టీతో అలాట్‌మెంట్ ఇస్తే జూనియర్లకు అన్యాయం జరుగుతోంది. –పి. మధుసూదన్‌రెడ్డి, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్.
- Tags
- job recruitment