20 నుంచి జేఎన్‌టీయూ పరీక్షలు

by Shyam |
20 నుంచి జేఎన్‌టీయూ పరీక్షలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా వాయిదా పడిన ఇంజినీరింగ్‌ పరీక్షలను నిర్వహించేందుకు జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్‌) సిద్ధమవుతోంది. బీటెక్, బీ-ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను ఈ నెల 20 నుంచి, ఫార్మ్-డి పరీక్షలను జూలై 16 నుంచి, ఎంటెక్, ఎం.ఫార్మా కోర్సులకు ఆగస్టు మూడు నుంచి సెమిస్టర్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పరీక్షలకు సంబంధించిన పలు కీలకమైన మార్గదర్శకాలను జేఎన్‌టీయూ జారీ చేసింది. సెమిస్టర్ పరీక్షల సమయాన్ని రెండు గంటలకు కుదించడంతో పాటు, ఒక్కో ప్రశ్నకు గరిష్టంగా 20 నిమిషాల్లోపే సమాధానం రాసేవిధంగా ప్రశ్నాపత్రాన్ని రూపొందించనున్నారు. విద్యార్థులు చదువుతున్న కళాశాలల్లో పరీక్షలను నిర్వహించడంతో పాటు డిటెన్షన్ విధానాన్ని కూడా రద్దు చేశారు. పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ రాసే అవకాశాన్ని కల్పించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed