- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘రాష్ట్ర హోదా కల్పిస్తారని మోడీ హామీనిచ్చారు’
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో ఏర్పడ్డ కొత్తపార్టీ.. జమ్ము కశ్మీర్ అప్ని పార్టీ(జేకేఏపీ) ప్రతినిధులు శనివారం సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్‌కు చెందిన పార్టీతో ప్రధాని తొలిసారి భేటీకావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదా మొదలు స్థానికుల హక్కుల వరకు ప్రధానితో చర్చించామని జేకేఏపీ చీఫ్ అల్తఫ్ బుఖారీ సహా పార్టీ ప్రతినిధులు చెప్పారు. జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడంపై స్థానికుల్లో అసంతృప్తి ఉన్నదని, ప్రజలకు సర్కారుకు మధ్య అంతరం పెరిగిపోయిందని తెలిపినట్టు వివరించారు. అయితే, తాము లేవనెత్తిన అంశాలపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని జేకేఏపీ నేతలు చెప్పారు. జమ్ము కశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించనున్నట్టు హామీనిచ్చారని వివరించారు.
tags : : jammu kashmir, JKAP, statehood, domicile rights, article 370