- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జేకే టైర్ నికర నష్టం రూ. 47 కోట్లు!
ముంబయి: గత ఆర్థిక సంవత్సరానికి నాలుగో త్రైమాసికంలో జేకే టైర్ రూ.47.2' కోట్ల నికర నష్టాలను ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 33.66 కోట్ల నికర లాభాలను నమోదు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం రూ. 1,794.76 కోట్లకు తగ్గింది. 2018-19 ఇదే కాలంలో రూ. 2,703.71 కోట్లుగా ఉండేదని జేకే టైర్ కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2019-20 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం 2018-19లో రూ .170.57 కోట్లతో పోలిస్తే రూ. 1141.31 కోట్లుగా ఉందని పేర్కొంది. 2018-19లో రూ. 10,367.76 కోట్లతో పోలిస్తే 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ఆదాయం రూ. 8,724.9 కోట్లకు తగ్గింది. భారత వ్యాపారంలో 32 శాతం క్షీణతను నమోదు చేయగా, మెక్సికో ఆదాయంలో మాత్రం 36 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ అధికార వర్గాలు తెలిపాయి. వాటాదారులకు ఒక్కో షేర్‌కు రూ.0.70 డివిడెండ్ చెల్లించేందుకు కంపెనీ బోర్డు సిఫారసు చేసింది.