- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హోం క్వారంటైన్ వారికి జియోట్యాగింగ్!
దిశ, నిజామాబాద్: ప్రపంచాన్నే కుదిపేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) కట్టడికి ప్రభుత్వాలు ఇప్పటికే పలు చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ వైరస్ ప్రధానంగా విదేశాల నుంచి వారు హోం క్వారంటైన్‌లో ఉండకుండా క్రమశిక్షణా రాహిత్యం ప్రదర్శిస్తూ జనాల్లో తిరుగుతుండటం వల్ల ఇంకా ఎక్కువగా వ్యాపిస్తోందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే హోం క్వారంటైన్‌లో ఉన్న వారిని కట్టడి చేసేందుకు సిద్ధమవుతోన్నట్టు తెలుస్తోంది.
ట్యాగింగ్ కోసం పకడ్బందీ చర్యలు..
కోవిడ్ -19 నియంత్రణకు ప్రభుత్వం సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటోంది. అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి స్వీయ నిర్బంధంలో ఉండాలని, అందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన వారు సుమారు 3,500 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వీరందరికీ అధికారులు హోం క్వారంటైన్ స్టాంపులు వేసి ఇండ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే, హోం క్వారంటైన్‌లో ఉండకుండా కొంతమంది ఇంటి నుంచి బయటకెళ్తున్నారనే ఫిర్యాదులు పోలీసులకు వస్తున్నాయి. ఇటీవల క్వారంటైన్‌ను ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా కేసులు నమోదు చేయడం కంటే హోం క్వారంటైన్‌లో ఉండే వారికి జియోట్యాగింగ్ చేయాలని పోలీసు శాఖ యోచిస్తోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే జియోట్యాగింగ్ చేయగా, ఇది అన్ని జిల్లాల్లో అమలుకు చర్యలు తీసుకునే పనిలో పడింది పోలీసు శాఖ. ఇప్పటికే హోం క్వారంటైన్‌లో ఉన్న వారి పాస్ పోర్టులను అధికారులు సీజ్ చేశారు. కరోనా విస్తరణ రెండో దశకు చేరుకోకుండా ఉండేందుకు జియోట్యాగింగ్ ఉపయోగపడుతుందని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు ఒకటే కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. అయితే, కరోనా అనుమానితుల వివరాలు పోలీస్ స్టేషన్ల వారిగా పోలీసులు ఇంకా సేకరిస్తున్నారు.
Tags: jiotagging, home quarantine, corona virus (covid-19), effect