వర్కింగ్ మదర్స్.. సమయం కేటాయించుకోండి : జిల్ బైడెన్

by vinod kumar |
వర్కింగ్ మదర్స్.. సమయం కేటాయించుకోండి : జిల్ బైడెన్
X

దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరికీ విశ్రాంతి తీసుకునే సమయం, ఎంజాయ్ చేసే సందర్భాలుంటాయి. కానీ ‘అమ్మ’ మాత్రం నిత్యం పనులతోనే జీవితాన్ని గడిపేస్తుంది. 365 రోజులు, 24/7 చచ్చేవరకు పనిచేసే మెదడులా.. అమ్మ కూడా ఇంటా, బయటా అలుపన్నదే లేకుండా పరుగులు పెడుతూ, పనులన్నీ చక్కబెడుతుంటుంది. అందరికి ఏమో గానీ, లాక్‌డౌన్ మాత్రం ‘అమ్మ’పై మరింత భారాన్ని మోపగా, వర్కింగ్ మదర్స్ బాధ్యతలను రెట్టింపు చేసింది. ఈ క్రమంలోనే పాండెమిక్ ‘వర్కింగ్ మదర్స్’‌కు ఎలా సవాలుగా నిలిచిందో అమెరికన్ ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ వివరించారు. అంతేకాదు, పని చేసే తల్లుల కోసం కొన్ని ముఖ్యమైన సలహాలను పంచుకోవడంతో పాటు పిల్లల్ని పెంచడం, వృత్తిని కొనసాగించే విషయంలో తన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

‘వర్కింగ్ మదర్స్ మెంటల్‌గా ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నారు. కష్ట సమయాల్లో ఎంతో ధైర్యంగా మీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీ వంతు కృషి చేశారు, చేస్తున్నారు. పాండెమిక్‌లో విశ్రాంతి లేకుండా పరిశ్రమించారు. ఇప్పుడే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తల్లులు, పిల్లల్ని పెంచడంతో పాటు కుటుంబ బాధ్యతలను చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రతి క్షణం మల్టీ టాస్క్‌‌లకు అలవాటుపడ్డారు. మా పిల్లల్ని పెంచే విషయంలో నాకు ‘జో’తో పాటు మా కుటుంబం నుండి పూర్తి సహాయసహాకారాలు అందాయి. అందుకే నేను అదృష్టవంతురాలిని. కానీ మీరు ఒక కుటుంబాన్ని పోషించడానికి, వృత్తిని కొనసాగించడానికి అదృష్టవంతులు కానవసరం లేదు. అందరికీ ఒకే విధమైన సాయం, ప్రొత్సాహం దక్కకపోవచ్చు. కానీ తీవ్రమైన పని ఒత్తిడి నుంచి మీ కోసం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి. ఆనందపడే క్షణాలను వదులుకోవద్దు’ అని జిల్ బైడెన్ సూచించింది.

‘నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జిల్‌కు ఒకప్పుడు థీసెస్ రాయవలసిన అవసరం వచ్చింది. అప్పుడు ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేని వాతావరణాన్ని ఇవ్వడానికి, జో.. పిల్లలను బయటకు తీసుకెళ్లేవాడట. ఇక జో ఉపాధ్యక్షుడైనప్పుడు లేదా ఇప్పుడు కూడా తన కెరీర్‌ను పక్కన పెట్టమని అతనెప్పుడూ చెప్పలేదంది. ఇక 2009లో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న టైమ్‌లో కమ్యూనిటీ కాలేజీల్లో అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించిన జిల్.. తన సలహాదారులు రెండు బాధ్యతలు నిర్వర్తించడం కష్టమని సూచించినా, జో మాత్రం తనను ప్రోత్సహిస్తూ, తప్పక చేయగలవనే ధైర్యాన్నిచ్చాడని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story