- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గాజా పునర్నిర్మాణానికి సాయం అందిస్తాం : బైడెన్
by Shamantha N |
X
వాషింగ్టన్ : గాజా పునర్నిర్మాణానికి కావాల్సిన సహాయాన్ని అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు రాజ్యాలుగా ఏర్పాటు చేయడమే ఈ సమస్యకు ఉన్న ఏకైక పరిష్కార మార్గమని ఆయన తెలిపారు. జెరూసలెంలో ఇరువర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణలకు తక్షణమే ముగింపు పలికేందుకు చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను కోరినట్టు వెల్లడించారు. ఇజ్రాయెల్ రక్షణకు అగ్రరాజ్యం కట్టుబడి ఉందని తెలిపారు.
తమ నిర్ణయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించారు. ఇజ్రాయెల్ ఉనికిని గుర్తించేంత వరకు నిస్సందేహంగా అక్కడ శాంతి నెలకొనదని తెలిపారు. రెండు దేశాల మధ్య దశాబ్దాల వివాదానికి తెరదించేందుకు జెరూసలెం ఉమ్మడి రాజధానిగా ఇజ్రాయెల్, పాలస్తీనాలను రెండు దేశాల గుర్తించడమే తక్షణ పరిష్కారంగా కనిపిస్తోందన్నారు.
Advertisement
Next Story