- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరీరాన్ని ముక్కలు చేసి.. బాలుడిని హతమార్చిన స్నేహితులు
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలుడిని తన స్నేహితులే అత్యంత పాశవికంగా చంపేశారు. డియోగర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14 ఏళ్ల తమ కుమారుడు కనిపించట్లేదని కుటుంబ సభ్యులు బుధవారం ఫిర్యాదు చేసినట్లు పోలీస్ అధికారి పవన్ కుమార్ తెలిపారు. విచారణలో స్నేహితులే బాలుడిని హతమార్చినట్లు వెల్లడైనట్లు చెప్పారు. ‘మంగళవారం రాత్రి రోహిన్ గ్రామంలో బాలుడిని ఇద్దరు స్నేహితులు కలుసుకున్నారు. పక్కనే ఉన్న పలంగా పహడ్ అడవిలోకి వెళ్లారు.
ఈ క్రమంలో బాలుడికి, స్నేహితుడు అవినాష్‌కు ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు స్నేహితులలో ఒకరైన అవినాష్ కత్తితో బాలుడి గొంతు కోశాడు. దీంతో ఆ బాలుడు మరణించాడు. అక్కడితో ఆగకుండా కాళ్లు, చేతులు శరీరం నుంచి వేరు చేశారు. ఆ శరీర భాగాలను మూడు సంచుల్లో వేసి అడవిలో దూరంగా పడవేశారు’ అని పోలీసు అధికారి వెల్లడించారు. కాగా, అవినాష్ నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. అతని వద్ద నుంచి కత్తి, మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు ఇచ్చిన సమాచారంతో శరీర భాగాలను గుర్తించామని తెలిపారు.