- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు : ఝాన్సీ
సీరియల్ నటులు చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ‘ఆమె కథ’ సీరియల్ హీరో హీరోయిన్లతో పాటు పలువురు నటులకు కరోనా సోకగా దాదాపు అన్ని సీరియళ్లు షూటింగ్ వాయిదా పడింది. ఈ క్రమంలోనే ప్రముఖ నటి, యాంకర్ ఝాన్సీ కూడా కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై క్లారిటీనిచ్చింది ఝాన్సీ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను సెండ్ చేసింది.
ప్రస్తుతానికి పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని తెలిపిన ఝాన్సీ.. తనకు కరోనా రాలేదని స్పష్టం చేసింది. తాను షూటింగ్‌లో పాల్గొన్న సెట్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపింది. ఇప్పటికే వారం రోజులు అయిందని.. మరో వారం రోజులు ఇంట్లోనే జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. కరోనా వచ్చిందో రాలేదో అనే సందిగ్ధంలో బయటకు వెళ్లి.. ఇతరులకు కరోనా వ్యాప్తి చేసే బదులు ఇంట్లోనే చక్కగా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఊహాగానాలతో అనవసరమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా వ్యవహరించాలని ఈ వీడియోలో మీడియాను కోరింది.