- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫుడ్ వేస్టేజ్ నుంచి ‘ఏవియేషన్ ఫ్యూయల్’
దిశ, ఫీచర్స్ : భారత్‌లో ప్రతీ కుటుంబం ఏడాదికి 50 కిలోల ఆహారాన్ని వృథా చేస్తోందని ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్(యూఎన్ఈపీ) ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్టు-2021 పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతుండగా, అందులో భారత్ వాటా 68.7 మిలియన్ టన్నులని వెల్లడించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయిన మొత్తం ఆహారంలో 17 శాతం వృథా కావడం గమనార్హం. కాలుష్యం, వాతావరణ మార్పులు, ప్రకృతి సమతుల్యత, జీవ వైవిధ్యం, గ్రీన్ హౌస్ గ్యాసెస్, కర్బన ఉద్గారాల పెరుగుదల వంటి మానవ మనుగడను ప్రశ్నార్థకం చేసే పరిణామాలను ఆపాలంటే మొదలు ఆహార వృథాను అరికట్టాలి. ఆహారవృథాను అరికడితే ఓ రకంగా ప్రపంచాన్ని కాపాడినట్లేనని యూఎన్‌ఈపీ పిలుపునివ్వగా.. పలు సంస్థలు, శాస్త్రవేత్తలు ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా శాస్త్రవేత్తలు ఫుడ్ వేస్టేజ్ నుంచి వినూత్న ఆవిష్కరణ శ్రీకారం చుట్టారు. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించడమే కాక ఫ్యూయల్‌గానూ పని చేస్తుండటం విశేషం.
సాధారణంగా ఫుడ్ వేస్టేజ్‌ను చెత్త కుండల్లో పడేస్తుంటాం. తద్వారా పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశాలుండటంతో పాటు కర్బన ఉద్గారాలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫుడ్ వేస్టేజ్ నుంచి సస్టెయినెబుల్ ప్రొడక్ట్ తయారు చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. ఫుడ్ వేస్టేజ్(పొడి) సేకరించి దాన్ని ప్యారాఫిన్(paraffin) లిక్విడ్‌గా కన్వర్ట్ చేశారు. దీనిని సస్టెయినెబుల్ ఏవియేషన్ ఫ్యూయల్(SAF) మార్చి, పవర్ జెట్ ఇంజిన్లలో ఉపయోగించి టెస్ట్ చేశారు. ఈ ఫ్యూయల్ వాడటం వల్ల గ్రీన్ హౌస్ కర్బన ఉద్గారాల 165 % తగ్గుతాయని శాస్త్రవేత్తలు తమ అధ్యయనం ద్వారా నిర్ధారించారు.
కాగా ఏవియేషన్ ఇండస్ట్రీ కోసం రూపొందించబడిన ఈ ఫ్యూయల్.. కార్లు, హెవీ వెహికల్స్ కోసం తయారు చేసిన బయోడీజిల్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఈ జెట్ ఫ్యూయల్ మేకింగ్‌పై ఇంకా రీసెర్చ్ చేస్తున్నట్లు, దీనిని ఇంకా విస్తృతంగా ఎలా వినియోగించాలనే అంశమై పరిశీలిస్తున్నట్లు యూఎస్ నేషనల్ రిన్యువెబుల్ ఎనర్జీ ల్యాబరేటరీ లీడ్ సీనియర్ రీసెర్చ్ ఇంజినీర్ డెరెక్ వర్దన్ తెలిపారు. ఈ ఫ్యూయల్‌ను 2023 వరకు ఫ్లైట్స్‌లో కూడా వాడేందుకు ప్రయత్నిస్తామని, ట్రయల్స్‌లో భాగంగా సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్‌లో టెస్టింగ్ చేస్తామని చెప్పారు.