ఆఫ్ఘన్‌లో ఆత్మాహుతి దాడి.. ఏడుగురు మృతి

by vinod kumar |   ( Updated:2021-10-15 05:02:57.0  )
talibans-2
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆప్ఘన్‌లోని కాందాహార్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందిగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. శుక్రవారం కాందాహార్‌లోని మసీదులో ఈ బాంబు దాడి జరిగినట్లు తాలిబన్లు ప్రకటించారు.

అయితే, ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఉగ్రవాద సంస్థలు ఏవీ కూడా ఈ దాడికి తామే కారణమని ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా, ఈ దారుణానికి ఒడిగట్టింది ఐసిస్ ఉగ్రవాదులేనని తాలిబన్లు అనుమానిస్తున్నారు. కాగా, ఇటీవల ఐసిస్ ఉగ్రవాదులను ఏరివేయాలని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed