గేట్స్ దంపతుల విడాకులపై వారి కూతురు సంచలన వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-05-05 05:25:01.0  )
గేట్స్ దంపతుల విడాకులపై వారి కూతురు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆయన సతీమణి మిలిందా గేట్స్ తో విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నో ఆలోచనల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకొంటున్నామని బిల్ గేట్స్ తెలిపారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోతున్నామని, గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యక్రమాల్లో మాత్రం భాగస్వాములుగానే ఉంటామని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయమై బిల్ గేట్స్ పెద్ద కుమార్తె జెన్నీఫర్ కేథరిన్ గేట్స్ స్పందించింది. తన ఇన్స్టా వేదికగా జెన్నీఫర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. “నా తల్లిదండ్రులు విడాకులు తీసుకొంటున్నారన్న వార్త మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ పరిస్థితిని నేను ఎలా ఎదుర్కోవాలో నాకు అర్ధం కావడం లేదు. నా తల్లిదండ్రుల విడాకుల విషయంలో నేనేమి జోక్యం చేసుకోదలుచుకోలేదు.. నేనెప్పుడూ నా కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలబడడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి సమయంలో మీరిచ్చే సపోర్ట్ నాకెంతో ధైర్యాన్నిస్తుంది” అంటూ పోస్ట్ చేసింది. అంతేకాకుండా తమ కుటుంబ పరిస్థితిని అర్ధం చేసుకొని తమకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని తెలిపింది.

Advertisement

Next Story