ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ కమాండర్ హతం..

by Shamantha N |
ఎన్‌కౌంటర్‌లో జైషే మహ్మద్ కమాండర్ హతం..
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ కమాండర్ సజ్జద్ ఆప్ఘనీతో సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందినట్టు భద్రతా బలగాల అధికారులు తెలిపారు. సజ్జద్.. దేశంలోని యువతను ఉగ్రవాదులుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాడని అధికారులు పేర్కొన్నారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో ఏకే-47 గన్స్, యూబీఎల్ షెల్స్, అమెరికా మేడెడ్ ఎమ్-4 కార్బైన్ రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story