- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధుయాష్కిని ఉరికించి కొడతారు : జీవన్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో : ఫాదర్ ఆఫ్ ది కరప్షన్ పార్టీ కాంగ్రెస్ అని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అంటే అవినీతి.. అవినీతి అంటేనే కాంగ్రెస్ అని విమర్శించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుయాష్కి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మధుయాష్కి నేరచరిత్ర అందరికీ తెలుసునని.. ఆరోపణలు మానుకుంటే మంచిదని సూచించారు. పిచ్చిగా మాట్లాడితే జన ఉరికించి కొడతారని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ను కచరా అని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎక్కడ తిరిగితే అక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.
నిజామాబాద్ అభివృద్ధికి ఎమ్మెల్సీ కవిత పాటుపడుతున్నారని ఆమెను ఒక మహిళ అని చూడకుండా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తిట్టడం స్టార్ట్ చేస్తే ఆ గాలికే కొట్టుకుపోతావ్ అన్నారు. మధుయాష్కి ఏ గ్రామానికి వెళ్లినా అడ్డుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ఫారుక్ హుస్సేన్, పురాణం సతీష్, వి.గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.