కేసీఆర్‌ను ప్రజలు ప్రధానిలా చూడాలనుకుంటున్నారు..

by Anukaran |
కేసీఆర్‌ను ప్రజలు ప్రధానిలా చూడాలనుకుంటున్నారు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో వచ్చే 2023 ఎలక్షన్‌లో కాంగ్రెస్, బీజేపీలు సింగిల్ డిజిట్ సీట్ కూడా సాధించలేరని పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నేతలు కోతులు, కొండముచ్చుల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ అని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌కు నెత్తి లేదు నత్తి మాత్రమే ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌కు కత్తి లేదు.. నత్తి, సుత్తి రెండు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు నాంపల్లి బ్రదర్స్‌లా కలిసి పని చేస్తున్నారని ఆ రెండు పార్టీల ఆఫీస్‌లు కూడా నాంపల్లిలోనే ఉన్నాయన్నారు.

తెలంగాణ ప్రభుత్వం పనితనమేమిటో నీతి ఆయోగ్ ప్రపంచానికి చాటి చెప్పినా ప్రతిపక్షాలకు కనబడటం లేదన్నారు. కేసీఆర్‌ను ప్రజలు ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. బీజేపీ పార్టీ స్కామ్‌ల పార్టీ అని, బీజేపీ వకాల్తా పుచ్చుకున్న రేవంత్ బుద్ధి సిగ్గులేకుండా ఈ పార్టీకి బంట్రోత్‌గా మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి బీజేపీకి ఉరి అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 150 ఎకరాల్లో వరి వేశారనేది అబద్ధమన్నారు.. అక్కడ అంత భూమే లేదని తెలిపారు. నిరుద్యోగం గురించి బండి సంజయ్ ఏదైనా చెప్పాలనుకుంటే మోడీకి చెప్పాలని హితవు పలికారు. గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై దండెత్తుతున్న అమిత్ షా లాంటి వాళ్లే నాదిర్షాలని, గుజరాత్ బేరగాలతో తెలంగాణలో అధికారంలోకి వస్తారా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story